మెగాస్టార్ చిరంజీవి .. తన బ్లడ్ బ్యాంక్‌లో రెగ్యులర్‌గా రక్తదానం చేస్తున్న వారి పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 50 సార్ల కంటే ఎక్కువ సార్లు రక్త దానం చేసిన వారికి ‘చిరు భద్రత’ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ చేయించారు. వారికి గవర్నర్ చేతుల మీదుగా రాజ్ భవన్లో ఆ పత్రాలు అందించారు. ప్రస్తుతం చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 2 నుంచి 3 వేల మంది చాలా తరచుగా రక్తం ఇస్తుంటారని . అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చిరు భద్రత అనే పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని భావించినట్లుగా చిరంజీవి తెలిపారు.
1998లో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని గుర్తు చేసుకున్నారు. ఆ తనను ప్రేమించే అభిమానులు ఉన్నందున వారి ప్రేమను నలుగురికి పంచాలనే ఉద్దేశంతో ఆనాడు చిరంజీవి రక్త నిధిని స్థాపించానని చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 70 శాతం రక్తం పేదలకు ఉచితంగా అందించామని, మిగతా రక్తాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అందించామని చెప్పారు. ఇప్పటిదాకా తాము 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు.
కరోనా సమయంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభించినప్పుడు గవర్నర్ తనను ఎంతో ప్రోత్సహించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాజ్‌భవన్ తరఫున కూడా వివిధ సందర్భాల్లో రక్తదాన శిబిరాలు చేపడుతున్నామని అన్నారు. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్‌ను రూపొందించామని కూడా తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులో భాగం కావాలని తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని కోరారు. చిరంజీవి ప్రయత్నం గవర్నర్‌ను ఆకట్టుకుంది.