కొరియన్ సినిమా కి రీమేక్ గా విజయం అనుకుంది ఓ బేబీ. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలసి మరో కొరియన్ రీమేక్ ని చేశారు. అదే ‘శాకిని డాకిని’. సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ ఇది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. సుధీర్ వర్మ దర్శకుడు. సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో దర్శకుడు సుదీర్ వర్మ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయడం లేదు.
దీనికి వెనుక ఒక బలమైన కారణం వుంది. సినిమా నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి ఫిల్మ్ మేకింగ్ లో ఎక్కువగా ఇన్వాల్ అయ్యారని ఇన్ సైడ్ టాక్. కొరియన్ స్క్రిప్ట్ ని యధాతధంగా తీయాలని పట్టుబట్టారు సునీత. సుదీర్ వర్మ కొన్ని మార్పులు సూచించాడు. కానీ వినలేదు. కొరియన్ స్క్రిప్ట్ ప్రకారమే మొత్తం షూట్ చేసేశాడు. అయితే అవుట్ పుట్ తేడా కొట్టింది. దీంతో కొన్ని మార్పులు సూచించారట సునీత. ఈ మార్పులు చేయడానికి సుధీర్ వర్మ అంగీకరించలేదు. ఇక్కడే ఈగో సమస్యలు వచ్చాయి. సునీత మరో దర్శకుడిని పెట్టి రీ షూట్ చేశారు. ఈలోగా సుధీర్ వర్మ రవితేజ రావణాసుర సినిమాతో బిజీ అయిపోయారు. ‘శాకిని డాకిని’కి తన అంగీకారం లేకుండా మరో దర్శకుడితో షూట్ చేయడం సుధీర్ వర్మని భాదించింది. దీంతో సినిమా లైట్ తీసుకున్నాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా సుధీర్ రావడం అనుమానమేనని వినిపిస్తుంది.