తెలంగాణలో ఏదైనా రాజకీయమే. గణేష్ మండపాలు పెట్టుకోవడమే కాదు.. నిమజ్జనాలు కూడా రాజకీయమే. నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ ఘాటు ప్రకటనలతో తెరపైకి వచ్చింది.ట్యాంక్ బండ్ పై ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి కారణం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడమే. హుస్సేసాగర్ జలాలు కలుషితమవుతున్నాయనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారెస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఆ విగ్రహాలే ఎక్కువ.
అందుకే ప్రభుత్వ పరంగా హుసేన్ సాగర్ ఒడ్డున నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఇదే అదనుగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం ంలేదని.. హిందూ పండుగలపైన మీరు కావాలని ఆంక్షలు పెడుతున్నారని బీజేపీ విమర్శలు ప్రారంభించింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవాలని చూస్తే సహించం. నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలను నేరుగా ప్రగతి భవన్ కు తీసుకొస్తాం. సాగర్ లో కాదు ప్రగతి భవన్ లో ఈసారి గణేష్ నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ ప్రకటించడం నిమజ్జనాల్లో రాజకీయం పీక్స్‌కు చేరిటన్లయింది.
ఓ వైపు గణేష్ ఉత్సవ కమిటీ మరో వైపు బీజేపీ కలిసి కేసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేశాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ భారీ క్రేన్ లు ప్రతీ ఏటా ఏర్పాటు చేసేవారు. మరీ ఈ ఏడాది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆంక్షలు పెడుతున్నారనేది ఓ వర్గం వాదన. బీజేపీ రాజకీయం గురించి తెలిసి కూడా టీఆర్ఎస్ చాన్సిస్తోందన్న అభిప్రాయం దీని వల్ల కలుగుతోంది.