ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవ్యవస్థను .. ప్రజలను పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి అమరావతిపై కుట్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. అమరావతి ఇష్యూని .,. మూడు రాజధానులుగా మార్చి.. పీక్స్‌కు తీసుకెళ్లి ఎటూ తేలకుండా ఎన్నికలకు వెళ్లి.. ప్రజాతీర్పు ఆ అంశంపైనే ఉండేలా చూసుకోవాలన్న వ్యూహాం అవలంభిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ఏపీసీఆర్డీఏ 2014 చట్టంలో పలు సవరణలు చేయాలని నిర్ణయించుకున్నారు ఆ సవరణలు ఏమిటన్నది మాత్రం బయటకు తెలియనివ్వలేదు. ఆ సవరణలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ది కార్యక్రమాల అమలుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
సీఆర్డీఏలోని ఏ చట్టం కూడా కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకి కాదు. కేవలం రైతులు ఇచ్చిన భూముల్ని రాజధానికి కాకుండా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోకుండా… జాగ్రత్తలు మాత్రమే ఉన్నాయి. రైతులు ఇచ్చిన భూముల్ని సెంట్ స్థలాలకు పంపిణీ చేయడం వంటి వాటిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. బహుశా .. కేంద్ర రాష్ట్ర అభివృద్ధి పనులు అంటే.. రైతులు ఇచ్చిన భూముల్ని సెంట్ స్థలాలుగా పంపిణీ చేసి… కేంద్రం పేదలకు ఇచ్చే ఇళ్ల డబ్బులతో ఇళ్లు కట్టించడం కావొచ్చంటున్నారు. ప్రతీ విషయంలోనూ కుట్ర పూరితంగా.. ఎవరికీ ఏమీ తెలియకుండా … ప్రజలను పరిగణనలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్న జగన్ సర్కార్ అమరావతి విషయంలో మరోసారి అదే భారీ కుట్రలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.
అదే సమయంలో అమరావతి అభివృద్ధి కోసమంటూ కొత్తగా.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏపీ సీఆర్డీఏలో ఫేస్ – 1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్లు గ్యారెంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ లో ఆమోదం తెలిపింది. కోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా.. కనీసం అభివృద్ధి పనులు చేపట్టకుండా.. గ్యారంటీలు..రుణాలు.. పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది. ప్రభుత్వం చేసే ఈ కుట్రల్ని ఎదుర్కోవడానికి మళ్లీ రైతులు సిద్ధం కావాల్సి ఉంది.