కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర పేరుతో కశ్మీర్ వరకూ ఈ యాత్ర సాగనుంది. దాదాపుగా ఐదు నెలల పాటు సాగే ఈ యాత్ర కాంగ్రెస్ రాత మారుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తోందని…సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితిని తెచ్చిపెడుతోందని తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఆ అసంతృప్తి ఇతర పార్టీల వైపు మళ్లడంలేదు.
ముఖ్యంగా కాంగ్రెస్ వైపు ఓటర్లు మళ్లీ చూడటం లేదు. ప్రస్తుత పాలనతో కాంగ్రెస్ పాలనను కంపేర్ చేసినా మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్లో పరిస్థితులే. నాయకత్వం సంక్షోభం ఆ పార్టీని వెంటాడుతోంది. రాహుల్ గాంధీని మోదీకి ధీటుగా నాయకుడిగా కాంగ్రెస్ ప్రజెంట్ చేయలేకపోయింది. కారణం ఏమైనప్పటకీ .. రాహుల్ గాంధీ స్టామినా ఉన్న నాయకుడని కాంగ్రెస్ వరగాలు బలంగా నమ్ముతున్నాయి.
ఇప్పుడు రాహుల్ కూడా ఫిక్సయినట్లుగా ఉన్నారు. నాడు తండ్రిని కోల్పోయానని..నేడు దేశాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేనని చెబుతూ భారత్ జోడో యాత్రను ప్రారంభించారరు. ఈ యాత్ర తో ప్రజల్లో రాహుల్ ..మోడీకి ధీటైన నాయకుడిగా నిలబడితే ప్రజల్లో మార్పు ఖచ్చితంగా వచ్చే చాన్స్ ఉంది. ఒక్క సారిమార్పు ప్రారంభమైతే.. అది వెల్లువలా మారుతుంది. దాని కోసం రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.