దళిత యువకుడు. చేపల చెరువును లీజుకు తీసుకున్నాడు. కానీ వైసీపీ నేతలు వేధించారు. చేపలు పట్టుకోనీయలేదు. వేధించారు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌నోట్‌లో వైసీపీ నేతల పేర్లు రాసి.. చివరికి తనకు ఇద్దరు ఆడపిల్లలని తనకు ఉన్న ఆస్తి ఇల్లు ఒక్కటేనని అదీ కూడా తాకట్టులో ఉందని విడిపించి తన కుటుంబానికి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. కానీ ప్రభుత్వం ఆ దళిత యువకుడు అప్పుల బాధ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేసింది. ఎలాంటి సాయం చేయలేదు.
కానీ నారా లోకేష్ దళిత యువకుడి కుటుంబానికి అండగా నిలిచారు. ఆస్తులు తనకా పెట్టుకొని వడ్డీకి డబ్బులిచ్చిన వారి వద్ద నుండి దస్తావేజులను విడిపించి స్వయంగా ఇంటి కాగితాలను కరుణాకర్ భార్యకు అప్పగించారు. కావలి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కరుణాకర్ ఇద్దరి పిల్లల చదువుకి సహాయం చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి. రాజకీయ ఓదార్పు మాత్రమే చేయకుండా వెంటనే ఆదుకున్న లోకేష్ వైఖరి ఆ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చింది. ధన్యవాదాలు చెప్పారు.
కరుణాకర్‌ను వేధించిన వారిలో శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు వైసీపీ సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కీలకం. చంద్రబాబు ఈ అంశంపై స్పందించడంతో పోలీసులు కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు. కానీ చేయాల్సిన న్యాయం మాత్రం చేయలేదు. లోకేష్ చేశారు. కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న లోకేష్‌కు తాడేపల్లి నుంచి కావరి వరకూ టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.