ఏపీ ప్రభుత్వం ఆలోచనలు మరీ చిన్న పిల్లలు కసి తీర్చుకునేందుకు చేస్తున్నందుకు కుట్రల్లా ఉంటున్నాయి. వారికి అలా అనిపిస్తున్నాయో లేదో కానీ అమరావతి విషయంలో చేస్తున్న రోజుకో నిర్ణయం చూసిన వారికి… ఈ ప్రభుత్వం మరీ ఇంత ” బుద్దిమాంద్యం”తో ఉందా అన్న సందేహానికి రాక మానరు. గతంలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 29 గ్రామాల్లో ప్రజాభిప్రాయసేకరణ జరిపారు. ఒక్కరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు 22 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రజాభిప్రాయసేకరణ చేస్తారు.
29 రాజధాని గ్రామాలతోనే కార్పొరేషన్‌కు ఒప్పుకోని వారు 22 గ్రామాలతో ఎలా ఒప్పుకుంటారని అందరికీ వచ్చే డౌట్. అది ప్రభుత్వానికి తెలియనిది కాదు. కానీ రాజధాని రైతులు అన్నవరంకు రెండో మహాపాదయాత్రకు వెళుతున్నారుకాబట్టి వారిని అడ్డుకునేందుకు.. వారిని గ్రామసభల కోసం అయినా గ్రామాల్లోనే ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరీ ఇంత సిల్లీగా ఆలోచిస్తారా అని రైతులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గ్రామాలు మొత్తం మీద ఒకే రోజు ప్రజాభిప్రాయసేకరణ పెట్టినా రైతులు ఆ రోజు పాదయాత్ర విరామం ప్రకటించి వస్తారు.. ఒక్కో గ్రామంలో పెట్టినా.. ాయా గ్రామాల రైతులు వస్తారు. మరీ ఇంత చిన్న విషయం కూడా ఆలోచించకుండా మళ్లీ కార్పొరేషన్ పేరుతో నాటకాలేంటన్న విస్మయం వ్యక్తమవుతోంది.
అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం దుర్బుద్దితో వేసిన ప్రతీ అడుగూ విఫలమయింది. ఒకటి, రెండు సార్లు విఫలమయినప్పుడు మళ్లీ మళ్లీ పరువు పోగొట్టుకోకుండా .. వెనక్కి తగ్గితే విలువ నిలబడేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అదే పనిగా విఫలమవుతూకూడా తమ విలువను దిగజార్చుకుంటూ అమరావతిపై కుట్రలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నిర్ణయాలు చూసి రైతులు కూడా “పాపం.. జగన్ గెట్ వెల్ సూన్ ” అనుకుని తమ పోరాటం తాము చేసుకుంటున్నారు.