కేబినెట్ మీటింగ్‌లో సీఎం జగన్ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాము చేయడానికి ఏం లేదని.. అంతా చేసే వాళ్లు వేరే ఉన్నప్పుడు …తమపై అసంతృప్తి ఎందుకని మంత్రులు మథనపడుతున్నారు. సీఎం జగన్ మంత్రుల నుంచి ఏం ఆశిస్తున్నారు.. జగన్ అంచనాలను మంత్రులు ఎందుకు అందుకోలేకపోతున్నారన్నది ఆ పార్టీలో పజిల్‌గా మారింది. అయితే మంత్రి అనే పేరే కానీ పవర్.. విధులు ఏమీ లేకుండా ఊరకనే విపక్ష్ాన్ని తిట్టడమే విధి అన్నట్లుగా ఉంటే ఎలా అని మంత్రులు నసుగుతున్నారు.
ఎన్నికల మంత్రివర్గాన్ని సీఎం జగన్ గత ఏప్రిల్‌లోనే ఏర్పాటు చేసుకున్నారు.. దూకుడులో .. విపక్షానికి కౌంటర్ ఇవ్వడంలో మొదటి కేబినెట్లో మంత్రుల స్టైలే వేరు. సభ్యతో.. అసభ్యతో అనే దానితో సంబంధం లేకుండా విరుచుకుపడేవారు. కొత్త కేబినెట్లో అలాంటివారు మిస్సయ్యారు. విపక్షానికి సరైన రీతిలో కౌంటర్ ఇచ్చే మంత్రే లేకుండా పోయారు. విధానాలపై ఎవరు విమర్శలు చేసినా అమ్మనా బూతులు తిట్టడం వైసీపీకి విధానం. అసెంబ్లీలో అయినా సరే వ్యక్తిగత దూషణలు కామన్. కానీ కొత్త కేబినెట్లో మంత్రులు అలాంటి మార్క్‌ను చూపెట్టడంలో విఫలమయ్యారు.
కేబినెట్లో అత్యంత సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. వారు చాలా విషయాల్లో స్పందించడం లేదు. విపక్షానికి కొంత మంది మంత్రులు భయపడుతున్నారన్న ప్రచారం వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా జరుగుతోంది. రేపు తేడా వస్తే … తమపైనా అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటే తాము తట్టుకోలేమన్న అభిప్రాయం కొంత మంది మంత్రుల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే కాస్త నెమ్మదిగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. వీరిని ట్రాక్‌లోకి తెచ్చేందుకే జగన్ ప్రయత్నం . మరి వర్కవుట్ అవుతుందో లేదో ?