ఢిల్లీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. ప్రధానంగా అరబిందో గ్రూప్‌పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఈ అంశాన్ని లీడ్‌గా తీసుకుని వరుసగా ఒక్కో విషయం బయటపెడుతోంది. ఈ లిక్కర్ స్కాం పునాదులు తెలంగాణలో ఉన్నాయని చెబుతున్నారు కానీ.. తాడేపల్లి వరకూ విస్తరించాలన్న అనుమానాలను బీజేపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెల్లడవుతున్న విషయాలు .. అసలు పాత్ర ఏపీలోనే ఉందన్న అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి. ప్రధానంగా విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో ఇప్పుడు నిండా కూరుకుపోయింది.
ఎలాంటి ఆరోపణలు వచ్చినా .. చంద్రబాబుపై తిట్లతో విరుచుకుపడే విజయసాయిరెడ్డి .. ఐదు రోజుల నుంచి హిందీ ట్వీట్లు చేస్తున్నారు. మోడీని .. కేంద్రాన్ని పొగిడే కొద్దీ పొగడాలని అనుకుంటున్నారు. నాలుగైదు ట్వీట్లయినా ఇలా చేసేవారు. కానీ ఇప్పుడు అసలు ట్వీట్లు చేయడం లేదు. తెలుగు ట్వీట్లే చేయడం లేదు. అన్నీ ఇంగ్లిష్ , హిందీ ట్వీట్లే. దీంతో విజయసాయిరెడ్డి టెన్షన్‌లో ఉన్నారని.. లిక్కర్ స్కాం లింకులు బయటపడకుండా అన్ని వ్యవహారాలు చక్క బెట్టుకునే విషయంలో తీరిక లేకుండా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అరబిందో లిక్కర్ కార్టెన్ పేరుతో సోషల్ మీడియాలో ఇప్పటికే స్కాం గురించి మొత్తం ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నారు బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు. ఈ లిక్కర్ స్కాంను కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్నా… అందులో లింకులన్నీ బయటకు లాగితే . అరబిందోనే కీలకం అవుతుంది. అరబిందోను తప్పించాలంటే కేజ్రీవాల్‌ను కూడా వదిలేయాల్సి ఉంటుంది. బీజేపీని ఈ విషయలో విజయసాయిరెడ్డి ఒప్పించగలరో లేదో మరి !