తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిల మీడియా అటెన్షన్ కోసం ఇటీవలి కాలంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మాటలే ఎక్కువగా ఉంటున్నాయి. కేసీఆర్ ఉరేసుకోవాలంటూ చాలా సార్లు వ్యాఖ్యానించారు. అయితే మా కేసీఆర్నే అంత మాట అంటావా అంటూ ఒక్కరూ స్పందించలేదు. టైమ్ వేస్ట్ అనుకున్నారేమో కానీ.. షర్మిల మాత్రం ఆ ఘాటు విమర్శలు కంటిన్యూ చేస్తోంది. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ.. ఆయనపై విరుచుకుపడింది. గతంలో ఆయన మంగళవారం మరదలు అంటూ షర్మిలను కామెంట్ చేశారు. అప్పట్లోనే దుమారం రేగింది. నిరంజన్ రెడ్డి కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
అప్పట్లో షర్మిల కూడా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అవే వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్త్రీలో చెల్లిని,తల్లిని చూడలేని సంస్కార హీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పు దెబ్బలు పడుతయ్ అని హెచ్చరించారు. నిరంజన్ రెడ్డి ఎప్పుడో అన్న మాటలను.. మాటలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా గుర్తు చేసి మరీ నిరంజన్ రెడ్డిని చెప్పుతో కొడతానని షర్మిల హెచ్చరించడం మీడయా అటెన్షన్ కోసమేనని చెబుతున్నారు.
అయితే తెలంగాణ మీడియాలో ఆమెకు కనీస ప్రాధాన్యత కూడా లభించడం లేదు. ఆమ ఎన్నిమాటలన్నీ లైట్ తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు కూలీలతో కలిసి భోజనం చేస్తూ.. వారికి తనిపిస్తూ. తాను తింటున్న ఫోటోల్లాంటివాటిని మీడియాకు ఇస్తున్నారు.తమకు ఉన్న పరిమితమైన సోషల్ మీడియా బలంతో వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయోజనం మాత్రం ఉండటం లేదు.