కృష్ణంరాజు మృతి టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణ వార్త… నిజంగా షాకింగే. అయితే గత కొంతకాలంగా కృష్ణంరాజుకి ఆరోగ్యం సరిగా లేదు. రాధే శ్యామ్ విడుదల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓసారి అదుపు తప్పి క్రింద పడ్డారు. దాంతో.. ఆయన మంచానికే పరిమితమయ్యారు. అదే సమయంలో ఆయన కాలి వేలిని కూడా.. ఆపరేషన్ చేసి తొలగించారు. అప్పటి నుంచి వీల్ చైర్ ఆసరా తీసుకొన్నారు. నెల రోజుల క్రితం ఆయనకు రెండోసారి కొవిడ్ సోకి… తగ్గింది. అయితే.. పోస్ట్ కొవిడ్ సమస్యలు ఆయన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. శ్వాస తీసుకోవడం కష్టమైంది. అందుకే నెల రోజుల నుంచే ఆయన ఏఐజీ ఆసుపత్రిలో కృత్రిమ శ్వాస అందిస్తూ వచ్చారు. ఈరోజు తెల్లవారుఝామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.