కాంగ్రెస్ పార్టీక జవసత్వాలు కల్పించడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం కేరళలో పాదయాత్ర సాగుతోంది. రాహుల్ గాంధీ పర్యటన తమిళనాడు కాంగ్రెస్‌లో జోష్ నింపింది. రాహుల్ వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నడిచారు. కేరళలోనూ అదే జోష్ కనిపిస్తోంది. అదే ఊపును తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలోనూ భారత్ జోడో యాత్ర సాగనుంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్‌మ్యాప్ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 24న రాహుల్ కర్ణా టకలోని రాయచూర్ నియో జకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు. హైదరాబాద్ శివారును టచ్ చేస్తూ మహారాష్ట్ర వెళ్తారు. మొత్తం మీద 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర రాహుల్ తెలంగాణలో పాదయాత్ర చేస్తారు. రాహుల్ పాదయాత్ర ఎక్కున రోజులు తెలంగాణలో ఉంటూడటంతో.. పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశలో 4 రోజుల పాటు మాత్రమే యాత్ర సాగనుంది. రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 100 కిలోమీటర్లు సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీకి వెళ్లిపోయిన ఓటు బ్యాంక్‌ను తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. అయితే రాహుల్ పాదయాత్రను ఉపయోగించుకుని పార్టీని బలపరిచే నేతలు లేకపోవడమే కాంగ్రెస్‌కు ఇబ్బందికరం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న . కానీ తెలంగాణపై మాత్రం ఆ పార్టీకి ఆశలున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆదరించాలని పదే పదే ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో ఆదరణ ఉంటుందని.. ఆయన పాదయాత్ర తర్వాత పరిస్థితులు మారిపోతాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.