కేసీఆర్ ఏ సందర్భంలో మాట్లాడినా .. మోడీకి, కేంద్రానికి అన్వయించి తెలంగాణకు.. దేశానికి తీవ్ర అన్యాయం చేశారని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు .రెండురోజుల పాటు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో .. కేసీఆర్ తొలి రోజే దాదాపుగా రెండు గంటలకుపైగా ప్రసంగించారు. ఈ ప్రసంగం మొత్తం మోదీని విమర్శించడానికి.., తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేసింది చెప్పడంతో పాటు దేశానికి మోదీ ఎలా నష్టం చేశారు.. అలాగే తనతో సఖ్యతగా ఉన్న సీఎంలు ఉన్న రాష్ట్రాలకూ ఎలా అన్యాయం చేశారో కూడా కేసీఆర్ వివరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ప్రతీ సందర్భంలోనూ తెలంగాణ లింక్ పెట్టుకున్నారు.
తెలంగాణకు మోదీ అన్యాయం చేశారని చెప్పడానికి ఏడుమండలాల దగ్గర్నుంచి ప్రారంభించారు. చంద్రబాబు చేతిలో కీలబొమ్మగా మారి ఏడు మండలాలను గుంజుకున్నారని విమర్శించారు. ఇప్పుడు కరెంట్ బకాయిల పేరుతో ప్రపంచంలో లేనంత వడ్డీ వేసి కట్టమని ఆదేశించారని.. మరి తెలంగామకు ఇవ్వాల్సిన వాటి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇలాంటి ఆదేశాలివ్వడానకి మోదీ ఎవరి చేతిలో కీలుబొమ్మ అయ్యారో కేసీఆర్ చెప్పలేదు. తెలంగాణ విషయంలో గతంలో చెబుతున్న అన్ని విషయాలను మరోసారి శాసనసభా వేదికగాకేసీఆర్ వివరించారు.పనిలో పనిగా బీహార్ కూడా పాజిటివ్ మాటు చెప్పారు. బీహార్ అంటే బీమారీ రాష్ట్రం కాదని అక్కడ విద్యుత్ ప్రాజెక్టులువస్తే ఆ రాష్ట్రం దశ మారిపోతుందన్నారు.
వ్యవసాయం తన వల్ల కాదని రైతులు చేతులెత్తేసేలా కేంద్రం కుట్ర చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. లక్షల కోట్ల ఆస్తులు అమ్ముతున్నారని… అదానీ లాంటి వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు వారికి పోయే కాలం వచ్చింది. షిండేలు, బొండేలు ఎంత మంది వచ్చినా ఇక్కడ ఎవరు భయపడరు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడని గుర్తు చేశారు. మొత్తంగా కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల మిషన్ మోడ్లో ఉన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆరు నెలల్లోపు సభ నర్వహించాల్సి ఉండటంతో సమావేశపర్చిన కేసీఆర్..ఆ సమావేశాల్లోనూ .. తన జాతీయ అజెండా మేరకే ప్రసంగించారు