ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడకూడదని కేసీఆర్ అనుకుంటున్నారని అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది సోమవారం సభకు ఈటల రాజేందర్ హాజరు కాకుండా పోలీసులు అడ్డగించి వెనక్కి పంపేస్తారని … అప్పుడే సస్పెన్షన్ ఆదేశాలు వస్తాయనుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు. ఉదయం సమావేశాలు ప్రారంభం కాక ముందు నుంచీ అదే టెన్షన్. తీరా సమావేశాలు ప్రారంభమయ్యే సరికి.. ఈటల రాజేందర్ డుమ్మా కొట్టారు. సస్పెన్షన్ వేటు వేయంచుకోవడం ఇష్టం లేక ఈటల ఆగిపోయారన్న ప్రచారం జరుగుతోంది.
బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కారణంగా హాజరు కాలేకపోతున్నట్లుగా మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చారు. కానీ మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. తన వాదన వినిపించారు. బండి సంజయ్ పాదయాత్ర మధ్యాహ్నం సమయంలో ప్రారంభమయింది. ఈటల హాజరవ్వాలనుకుంటే ముందే హాజరై ఉండేవారు. అయితే ఓ అండర్ స్టాండింగ్తోనే ఈటల అసెంబ్లీకి గైర్హాజర్ అయినట్లుగా తెలుస్తోంది.
తెర వెనుక ఏం జరిగిందో కానీ..సస్పెండ్ చేసే వరకూ తెచ్చుున్నా ఈటలకే మైలేజ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే… కేసీఆర్ ఈటలకు భయపడుతున్నారన్న అభిప్రాయం బలంగా వెళ్తుంది. కానీ ఈటల అవకాశాన్ని వద్దనుకున్నారు. ఎందుకో ముందుముందు తెలిసే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ గైర్హాజర్ వ్యవహారం టీఆర్ఎస్ వర్గాల్లోనే ాదు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.