న్యాయమూర్తులపై దుషణలు, న్యాయవ్యవస్థపై దాడి విషయంలో వైసీపీ సోషల్ మీడియా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ విషయంలో సీబీఐ ఎప్పుడు విచారణ చేస్తుందో స్పష్టత లేదు కానీ.. అప్పుడప్పుడూ అరెస్టులతో విరుచుకుపడుతోంది. తాజాగా మరో ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. వీరంతా సోషల్ మీడియా కార్యకర్తలు. కేసులు నమోదయ్యే వరకూ పార్టీ కార్యాలయం నుంచే పని చేసినట్లుగా తెలుస్తోంది. తర్వాత స్వతంత్రం అన్నట్లుగా ఉంచారు. వీరి అరెస్టు గురించి సమాచారం ముందే తెలిసినా వైసీపీ నేతలు పెద్దగా ఎలాంటి మాట సాయం కానీ.. న్యాయపరమైన సాయం కానీ చేయలేదు. దీంతో ఏడుగురు సామాన్య కార్యకర్తలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో అరెస్ట్ కావాల్సిన మరో వ్యక్తి హిందూపురం కౌన్సిలర్ మారుతీరెడ్డికి మాత్రం ముందస్తు సమాచారం రావడంతో పరారయ్యారు.
న్యాయవ్యవస్థపై దాడి కేసులో ఇప్పటి వరకూ పార్టీ కార్యకర్తలనే అరెస్ట్ చేస్తున్నారు. పార్టీ నేతలు చెప్పినట్లుగా.. వైసీపీ సోషల్ మీడియా వింగ్ చెప్పినట్లుగా ముందూ వెనుకా చూసుకోకుండా వారు పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కానీ పార్టీ నాయకత్వం వైపు నుంచి అందుతున్న సహకారం ఏ మాత్రం లేకపోగా .. అసలు పెద్దలు తాము చేసిన నేరాన్ని వారిపైక తోసేస్తున్నారన్న అభప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి న్యాయవ్యవస్థీకృతమైన దాడి. ఆ విషయాన్ని సీబీఐ కూడా చెప్పింది. ఇది చాలా పెద్ద కుట్ర అని.. లోతుపాతులు వెలికి తీయాల్సి ఉందని హైకోర్టుకు చెప్పింది. ఆ ప్రకారం విచారణ జరుపుతోంది.
ఈ కేసులో ప్రధానంగా ముఖ్యమన నేతలు ఉన్నారు. జడ్జిల ఫోన్లను చెక్ చేయాలంటూ వ్యాఖ్యానించిన ఎంపీ నందిగం సురేష్ దగ్గర నుంచి తీర్పుకు ఉద్దేశాలు ఆపాదించిన గుడివాడ అమర్నాథ్ వరకూ చాలా మంది నిందితులుగా ఉన్నారు. ఇతర కార్యకర్తలు చేసిన వాటి కంటే వీరు చేసిన వ్యాఖ్యలే తీవ్రమైనవి. అయితే పదవిలో లేని ఆమంచి కృష్ణమోహన్ కూడా న్యాయపోరాటం చేసి ఏదో విధంగా అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నారు కానీ.. ఇతరులు కనీసం కేసులు కూడా ఎదుర్కోవడం లేదు. వారంతా తాము సేఫ్ గా ఉండి కింది స్థాయి వ్యక్తులను బలిస్తున్నారన్న అసహనం ఆ పార్టీలో కనిపిస్తోంది.
సీబీఐ అరెస్టుల విషయాన్ని సీఎం జగన్ కూడా లైట్ తీసుకుంటున్నారు. తమ పార్టీకి పని చేస్తున్న ఓ మహిళను కూడా అరెస్ట్ చేసినా ఆయన పెద్దాగ పట్టించుకోలేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. వైసీపీ పెద్దలు తాము చేసిన తప్పులకు… కార్యకర్తల్ని బలిస్తున్నారని.. వారితో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.