సోషల్ మీడియా విజయసాయిరెడ్డి చేతి నుంచి సజ్జల కుమారుడికి చేతికి వచ్చీరాగానే.. తమ మార్క్ చూపించారు. కానీ అది రివర్స్ అవడంతో సర్దుకోక తప్పలేదు. సజ్జల కొడుకు సోషల్ మీడయాను గాడిలో పెడతాడనుకుంటే ఫేక్ న్యూస్ లప్రచారంలో దశాబ్దం కిందటి మైండ్ వాడతారని స్పష్టమైంది. సజ్జల కొడుకు చేతికి వచ్చినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా పదేళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఏమీ మారలేదు. ప్రపంచం మారిందనే విషయాన్ని మాత్రం గుర్తు తెచ్చుకోలేకపోతోంది. ప్రపంచం ఎక్కడ ఏది కనిపించినా ఇక్కడ టీడీపీకి లింక్ పెట్టి వ్యతిరేక ప్రచారం చేస్తే చాలు..పనులు అయిపోతాయని అప్పట్లో అనుకునేవారు. కానీ ప్రజలు ప్రతీ సారి మోసపోరుగా. మోసం చేసే వాడి గురించి ఒక సారి కాకపోతే ఒకసారన్నా తెలుసుకుంటారనే ఆలోచన లేకుండా పోయింది.
తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఎక్కడో తమిళనాడులో ఓ బీజేపీ మహిళా నేత..మరో బీజేపీ నేతతో కాస్త తేడాగా ప్రవర్తిస్తున్న వీడియో వైసీపీ వాళ్లకు దొరికింది. అంతే చెలరేగిపోయారు. ఆయన బీజేపీ నేత అని ఆమె అమరావతి రైతు అని.. వాళ్ క్యారెక్టర్‌ను కించపిరచేలా కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో పెట్టారు. విజయసాయి చేతి నుంచి సోషల్ మీడియా వెళ్లిపోవడంతో తన పదవి ఉంటుందో లేదోనని కంగారు పడుతున్న ప్రస్తుత ఇంచార్జ్ గుర్రంరెడ్డి కూడా ఎక్కడా తగ్గలేదు. అయితే జనంలో వచ్చిన చైతన్యం గురంచి కాసేపటికే ఆయనకు తెలిసిపోయింది. డిలీట్ చేసుకున్నారు.
కానీ ఓ ప్రచారం మాత్రం ప్రారంభించానని ఆయన అనుకుంటున్నారు. కానీ మొత్తం రివర్స్‌లో జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా ఇంత దారుణంగా తయారైందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫేక్ ప్రచారాలను గతంలోలా గుడ్డిగా చేస్తే వర్కవుట్ కాదని.. ఈ సారి తమ టాలెంట్ అంతా చూపించాల్సిందేనని.. దానికి ఇప్పటికే తినడానికి అలవాటుపడిపోయిన సోషల్ మీడియా సైన్యాలకు తెలియదని వైసీపీలో సెటైర్లు పడుతున్నాయి. సజ్జల కొడుకు వచ్చి మారుస్తాడనుకుంటే.. మళ్లీ వెనక్కి తీసుకుపోయాడని సెటైర్లు వేస్తున్నారు.