భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నాయకురాగిలాగా ఉన్న పురందేశ్వరికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఓ దశలో ఆమెను ఏపీ బీజేపీ చీఫ్‌ను చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి ప్రయత్నమే జరగకపోగేా.. ఇప్పుడు దేశ స్థాయిలో ఆమెకు ఉన్న బాధ్యతల్ని కత్తిరించేస్తున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు ఇంచార్జ్‌గా ఉండేవారు. ఇటీవల ఇతరుల్ని నియమించి.. ఆమెకు మొండి చేయి చూపారు. దీంతో ప్రధాన కార్యదర్శిగా పదవి తప్ప పనులు లేని పరిస్థితి పురందేశ్వరికి ఎదురవుతోంది.
ఇలా హఠాత్తుగా బీజేపీ హైకమాండ్ ఆమెను ఎందుకు దూరం పెడుతుందో ఆ పార్టీలోని కొన్ని వర్గాలకు అర్థం కావడం లేదు. ఆమె విశాఖ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనూ ఆమెను పని చేసుకోనివ్వడం లేదు. అక్కడ జీవీఎల్ నరసింహారావు ఎక్కువ కనిపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లు కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ స్థాయి గుర్తింపు బీజేపీలో కనీస మాత్రం కూడా రాలేదు. పదేళ్లుగా ఎలాంటి పదవి ఇవ్వలేదు. రాజ్యసభ స్థానం కూడా ఇవ్వలేదు.
మామూలుగా పురందేశ్వరి కి ఉన్న నేపధ్యం .. ఆమెకు పార్టీలో పెద్ద పీఠ వేయడానికి సరిపోతుంది. కానీ ఎందుకో ..బీజేపీ అగ్రనాయకత్వం ఆమెను డౌన్ గ్రేడ్ చేస్తోంది. ఆమె బీజేపీలో ఉన్న సమయంలో దగ్గుబాటి వైసీపీ నుంచి పోటీ చేశారు. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఈ కారణంగా ఆమెను పక్కన పెడుతున్నారన్న అభప్రాయం వినిపిస్తోంది. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం పురందేశ్వరి కూడా సైలెంట్ అయిపోతున్నారన్న వాదన వినపిస్తోంది.