వైసీపీ నేతలు ఇతరుల పుట్టుకల్ని కించ పర్చడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారు. పవత్రమైన అసెంబ్లీలో అతి దారుణమైన భాష మాట్లాడటానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. గతంలో చంద్రబాబు భార్యపై దారుణమైన భాష వాడిన నేతలు ఇప్పుడూ తీరు మార్చుకోలేదు. ఈ సారి అసెంబ్లీ సమవేశాలు ప్రారంభమైన తొలి రోజే మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయస్వామిపై మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మేరుగ నాగార్జున సమాధానం చెబుతున్న సమయంలో.. మంత్రి అన్ని అవాస్తవాలు చెబుతున్నారని ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి ఆందోళనకు దిగారు.
ఉద్యోగాలు ఎక్కడ జగన్ అంటూ ఆందోళన చేశారు. దీంతో మేరుగ నాగార్జున తన నోటికి పని చెప్పారు. నువ్ దళితుడివేనా.. దళితులకే పుట్టవా అంటూ బాల వీరాంజనేయస్వామిపై విరుచుకుపడ్డారు.ఈ అంశంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. మేరుగ నార్జున దారుణంగా మాట్లాడారని.. మనిషి పుట్టుకల్ని.. తల్లిదండ్రుల్ని అవమానిస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. అయితే తాను రికార్డులు పరిశీలిస్తానని స్పీకర్ వారికి చెప్పారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు.
మైక్‌లో ప్రత్యక్ష ప్రసారాల్లో నాగార్జున మాట్లాడితే రికార్డులు పరిశీలిస్తామంటున్నారని..గతంలో కూడా ఇలాగే మాట్లాడి రికార్డులు లేవన్నారన్నారు. ఈ అంశంపై తర్వాత అసెంబ్లీలే మేరుగ నాగార్జున స్పందించారు. తాను బాధ్యతారాహిత్యంగా మాట్లాడలేదన్నారు. తప్పుగా మాట్లాడటమే కాకుండా సమర్థించుకుటున్న మంత్రిని బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. అసెంబ్లీలోనూ వైసీపీ ఎమ్మెల్యేల భాష ఇలా కలకలం రేపుతోంది.