రాజకీయ ప్రత్యర్తులను మానసికంగా దెబ్బకొట్టడానికి కుటుంబసభ్యులపై అత్యంత దారుణమైన ఆరోపణలు , తిట్లు అందుకునే వైసీపీ నేతలకు మొదటి నుంచి జగన్ ప్రోత్సాహం ఉంటుంది. అయితే ఇప్పుడు జగనే విచిత్రంగా.. రాజకీయాల్లో మనం ఎన్నైనా అనుకోవచ్చు కానీ కుటుంబసభ్యులను ఎందుకు ఇందులోకి లాగాని.. మీరు ఆపేస్తే.. మా వాళ్లూ ఆపేస్తారని.. అచ్చెన్నాయుడు ముందు ప్రతిపాదన పెట్టారు. అసెంబ్లీ బీఏసీ మీటింగ్‌లో ఈ అంశంపై కాసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మనం మనం రాజకీయ నాయకులం ఎన్నైనా అనుకుంటాం.. కానీ కుటుంబసభ్యులను ఈ రాజకీయ విమర్శల్లోకి లాగడం ఎందుకని జగన్ అచ్చెన్నాయుడును ప్రశ్నించారు.
కుటుంబ సభ్యుల జోలికి రావాలనుకోం. కుటుంబ సభ్యుల జోలికి మీరొస్తే మా ముఖ్యమంత్రిని అంటారా అని మావాళ్లూ అంటారు. మీరు మానేస్తే మావాళ్లూ ఆటోమెటిక్‌గా మానేస్తారు’ అని అచ్చెన్నాయుకుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై అచ్చెన్న స్పందనేమిటో క్లారిటీ లేదు. ఢిల్లీలో లిక్కర్ స్కాం వెలుగులోకి రావడంతో పాటు అక్కడ స్కాంలో విజయసాయిరెడ్డి బంధువుల కంపెనీ అయిన అరబిందో గ్రూప్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఈ అరబిందో గ్రూప్ సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టాయని.. ఈ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాంతో జగన్ సతీమణి భారతికి సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ నేతలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంతో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆయన కుటుంబంపై కొడాలి నానితో పాటు ఇతర నేతలు అసభ్య పదజాలంతో విరుచుకుపడటంతో.. రెండు పార్టీల నేతల కుటుంబసభ్యులను విమర్శించుకుంటున్నారు. భారతి ప్రస్తావన రాకుండా జగన్ చూడాలనుకుంటున్నారు.