ఏపీ ప్రభుత్వం ఏం చేసినా పారదర్శకంగా ఉండదు. లోగుట్టు ఉంటుందని అందరికీ తెలుసు. అదేంటో చాలా మందికి అర్థమైపోతుంది. కానీ బయటకు చెప్పలేని పరిస్థితి. ఏపీ రాజధాని పరిధిలో సీఆర్డీఏ అమ్ముతున్న భూముల వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఇంతకు ముందే మూడుచోట్ల సీఆర్డీఏ ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టింది. ఒకరిద్దరు కూడా కొనలేదు దీంతో రేట్లను సగానికిపైగా తగ్గించి.. రిబేట్లను ప్రకటించి.. అచ్చంగా రియల్ ఎస్టట్ కంపెనీల మాదిరి ఆఫర్లు పెట్టేసింది. సీఆర్డీఏ తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
జగన్ తీరు వల్ల అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అక్కడ భూమి కొనుగోలు చేయాలని అనుకున్న ప్రభుత్వ తీరు వల్ల వెనక్కి పోతున్నారు . అందుకే ఆ భూములకు విలువ రావడం లేదు. పైగా ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న స్థలాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు . ఎప్పుడు కల్పిస్తారో కూడా చెప్పలేదు. వెంటనే కల్పిస్తామని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అందుకే కొనేవారు లేరు. దీన్నే సాకుగా చూపి సగానికిపైగా రేట్లు తగ్గించి అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అతి తక్కువ ధరకైనా అమ్మాలని సీఐడీ ఎందుకు పట్టుబడుతుందో అందిరకీ తెలిసిన విషయమే. ఇప్పుడా పాట్లను అతి చవకగా కొంత మంది కొనేస్తారు. ఆ కొంత మంది ఎవరో చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీలో సీఎం జగన్ అమరావతి భూములకు విలువ లేదని పదే పదే చెప్పారు. ఎందుకలా చెప్పారో ఇప్పుడు సీఆర్డీఏ క్లారిటీ ఇస్తోందన్నమాట.