వరుణ్ తేజ్ కొత్త సినిమా ఖరారైయింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు వరుణ్. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైనర్ వుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. నవంబర్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగు హిందీ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ చిత్రం గురించి వరుణ్ చెబుతూ ”ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా నటించే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా, దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్లతో చేస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గొప్ప నివాళిగా వుంటుంది. ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ చేయని పాత్రని చేస్తున్నాను. ఒక ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ పాత్ర పోషించడం చాలా ఆసక్తికరంగా వుంది. నా పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఈ పాత్రకోసం ప్రత్యేకమైన శిక్షణ పొందాను. ప్రేక్షకులు దీనికి ఎలా స్పందిస్తారో చూడడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.