ఇండియాలోని ఎడ్యూటెక్ కంపెనీల్లో బాగా ప్రచారం పొందిన బైజూస్ కంపెనీ భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. గత ఆర్థిక సంవంత్సరంలో బైజూస్ ఏకంగా రూ. 4588 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఓ ఎడ్యూటెక్ కంపెనీకి ఇంత భారీగా నష్టాలు ఎలా వస్తాయా అని ఇండస్ట్రీ నిపుణులు సైతం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. అసలు జరిగిన వ్యాపారమే రెండున్నర కోట్లని ఆ సంస్థ చెబుతోంది. అలాంటప్పుడు రూ. నాలుగున్నర వేల కోట్ల నష్టం ఎలా వస్తుందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
సాధరారణంగా ప్రతి కంపెనీ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆ తర్వాత వెంటనే ఫలితాలు ప్రకటిస్తాయి.కానీ బైజూస్ ఆలస్యంగా ప్రకటించింది. అకౌంటింగ్లో మార్పులు చేసుకున్నామని ఇతర కారణాలు చెప్పారు. ఇప్పటికి ప్రకటించారు. కానీ అనూహ్యమైన నష్టాలు ప్రకటించారు. కానీ ఈ ఆర్థిక సంవత్సంలో తమకు గొప్ప పురోగతి ఉందని. వ్యాపారం పది వేల కోట్ల వరకూ ఉంటుందని లెక్కేసోంది బైజూస్. అయితే ఖచ్చితంగా త్రైమాసికానికైనా ఎంత ఆదాయం.. ఎంత నష్టం.. ఎంత లాభం అనేది మాత్రం రహస్యంగానే ఉంచుతోంది.
ఆదాయం పడిపోవడానికి బైజూస్ ఓనర్ రవీంద్రన్ విచిత్రరమైన కారణాలు చెబుతున్నారు. ఆదాయం పొందే మార్గాల గుర్తింపును మార్చామని.. చాలా మంది ఈఎంఐలలో కొనుగోలు చేశారని.. ఇన్స్టాల్ మెంట్లలో కడుతున్నారని ఇలా చెప్పుకొస్తున్నారు. ఆయన చెబుతున్నది చూస్తే.. ఎవరికైనా ఏదో దాస్తున్నారన్న అనుమానం రాక మానదు. కరోనా కాలంలో బైజూస్‌కు మంచి డిమాండ్ వచ్చింది. పెద్ద ఎత్తున వ్యాపారం.. కంపెనీ విలువ పెంచుకున్నారు. కానీ క్వాలిటీలేకపోవడంతో బైజూస్‌ను అందరూ వదిలించుకున్నారు. కరోనా సమయంలో ఉన్న వ్యాపారం ఇప్పుడు ఉండే అవకాశం లేదు. కానీ వ్యాపారం పెరిగిందని చెబుతున్నారు.
బైజూస్ ను ఏపీ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఆదుకుంటోంది. ఐదు వందల కోట్లు పెట్టి ట్యాబ్స్ కొంటామని ప్రకటించింది. ఈ ఐదు వందల కోట్లు బైజూస్‌కు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ ట్యాబ్స్ వల్ల అసలు ఉపయోగమే లేదని ఏపీ ఉపాధ్యాయులు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు.