వైసీపీ వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు హత్య కేసుల్లో ఉన్నా సరే ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలిచ్చింది. ఇలా ఉపసంహరించడం చట్ట విరుద్ధమని హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో చివరికి ప్రభుత్వం కూడా నిజం తెలుసుకుని జీవోలను ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టుకు తెలిపింది. అయితే ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు తెలిపిన జీవోల్లో ముఖ్యమంత్రి జగన్ కేసుల జీవోలు లేవు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అనేక మార్లు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడటం సహా.. ఇతర కేసులు ఉన్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత వాటిలో పదకొండు కేసుల్ని ఏకపక్షంగా ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైకోర్టు అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది. పదకొండు కేసుల్లో జగన్ కూడా నిందితునిగా ఉన్నారు. కేసుల ఉపసంహరణ తర్వాత… ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసులను.. చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకున్నారని హైకోర్టుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక సమర్పించింది.
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసులపై హత్యాయత్నం చేసిన కేసుల దగ్గర్నుంచి .. హత్య కేసుల్లో నిందితుల వరకూ.. కొన్ని వందల కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటన్నింటి ఉపసంహరణ జీవోలు .. రద్దు చేయక తప్పదు. అయితే కొన్ని జీవోలను ఉపసంహరించుకుంటున్న చెబుతున్న ఏపీ సర్కార్.. జగన్ కేసుల గురించి చెప్పకపోవడం … చర్చనీయాంశంగా మారింది.