ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఏ జోనర్ సినిమా అయినా సరే, రెండు మూడు భాషల్లో రిలీజ్ చేసి, మార్కెట్ చేసుకుంటున్నారు. శ్రీవిష్ణు అయితే ఇంకో అడుగు ముందుకేశాడు. ఏకంగా ఇంటర్నేషనల్ సినిమా ఒప్పుకొన్నాడు. ఈ విషయాన్ని విష్ణు అధికారికంగా ధృవీకరించాడు. “ఓ యూరోపియన్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా పెద్ద పెద్ద నటీనటులు ఉంటారు. వాళ్లతో కలిసి నేనూ నటిస్తున్నాను. ఈ సినిమాలోని ప్రతీ ఒక్క క్యారెక్టర్ ఒక్కో భాష మాట్లాడుతుంది. నేను మాత్రం తెలుగులోనే మాట్లాడతా. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమా అనిచెప్పలేను కానీ.. అన్ని ప్రాంతాల వారికీ కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా విషయాల్ని అధికారికంగా చెబుతా“ అన్నారు. శ్రీవిష్ఱు నటించిన `అల్లూరి` ఈవారమే విడుదల అవుతోంది. మైత్రీ మూవీస్, యూవీ క్రియేషన్స్‌లో ఒక్కో సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు విష్ణు. త్వరలోనే మైత్రీ మూవీస్ సినిమా పట్టాలెక్కబోతుంది.