అన్‌స్టాపబుల్ సీజన్ 2 త్వరలో ప్రారంభం కాబోతోంది. మరోసారి బాలయ్యతో `ఆహా` అనిపించే కంటెంట్ తో `అన్‌స్టాపబుల్`ని ముస్తాబు చేస్తున్నారు. సీజన్ 1 అంతా హీరోలతోనే నడిచిపోయింది. ఒక్క హీరోయిన్ తో కూడా బాలయ్య ఇంక్ట్రాక్ట్ అవ్వలేదు. అయితే సీజన్ 2లో ఆ టోటు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్లో కొంతమంది హీరోయిన్లతో బాలయ్య చిట్ చాట్ చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ముందు వరుసలో వినిపిస్తున్న పేరు అనుష్క.
అనుష్కని అన్ స్టాపబుల్ కి తీసుకురావడానికి ఆహా మేనేజ్మెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు… అనుష్క తో సంప్రదింపులు కూడా మొదలెట్టినట్టు సమాచారం. అనుష్క కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. మీడియాకు, సినిమా వేడులకు, ప్రైవేటు పార్టీలకూ దూరంగా ఉంటోంది. మరి అన్ స్టాపబుల్ లో కనిపించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు ఈ షోకి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లు వస్తారని ప్రచారం జరుగుతోంది. వాళ్లిద్దరూ వస్తే షోకి కొత్త కళ వస్తుంది. కాకపోతే.. పవన్ ఈ షోకి రావడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అల్లు అరవింద్‌కీ, పవన్‌కీ మధ్య అంత సఖ్యత లేదు. ఇద్దరి మధ్య కనిపించని కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి. ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ చేతిలో ఉన్న `ఆహా` షోకి పవన్ వస్తాడా అనేది పెద్ద ప్రశ్నే.