వైసీపీలో చంద్రబాబును వ్యతిరేకిస్తూ వైసీపీలో చేరిన కొంత మందికి ఎన్టీఆర్ ఇప్పటికీ దేవుడు. చంద్రబాబు వల్ల తమకు లాభం లేదని వైసీపీలో ప్రయోజనం కలుగుతుందని వారు ఆ పార్టీలో చేరారు. అక్కడ వారు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారన్నది పక్కన పెడితే.. అక్కడి నాయకత్వం వారి వ్యక్తిత్వాన్ని… దారుణంగా చంపేస్తోంది. ఆ విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. వారి కులాన్ని నిర్మోహమాటంగా తిట్టిస్తున్నారు. స్వయంగా సీఎం జగనే తిడుతున్నారు. కానీ వారికి చీమ కుట్టినట్లుగా ఉండటం లేదు. చివరికి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చినా ఉలకలేకపోతున్నారు.. పలకపోతుతున్నారు.
సొంత కులాన్ని పేరు పెట్టి తిడుతున్నా స్పందించలేని నిస్సహాయ నేతలు
ఓ సామాజికవర్గాన్ని జగన్ ఎంత దారుణంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. పచ్చళ్లు కూడా వాళ్లే అమ్ముకుంటారా.. సినిమాలు కూడా వాళ్లే చేస్తారా అని మాట్లాడారు. నిజానికి ఆ వ్యాపారాలు అందరూ చేస్తున్నారు. కానీ ఓ కులాన్ని తిట్టడానికి దాన్ని ఆయన వాడుకున్నారు. కానీ ఆ కులం వాళ్లు కిక్కురుమనలేదు. రాజకీయాల్లో కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగినవాళ్లే. వాళ్ల కులాన్ని తప్పు పడుతూంటే నోరెత్తలేని దౌర్భగ్య స్థితి. అప్పుడే వారి వ్యక్తిత్వం చచ్చిపోయినట్లయింది.
ఎన్టీఆర్కు ఇంత అవమానం జరుగుతున్నా… దైవంగా భావించేవారు ఎక్కడ ?
ఇప్పుడు ఎన్టీఆర్ దయతో రాజకీయాల్లోకి వచ్చి ఆయనను ఘోరం అవమానిస్తున్నా నోరెత్తకుండా చేసి వారిని మానసికంగా.. మరింత హింసించేశారు జగన్. లక్ష్మిపార్వతి.. ఎన్టీఆర్ భార్యనని చెప్పుకుంటారు. కానీ ఎన్టీఆర్ను ఎంత దారుణంగా అవమానిస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ ఎన్టీఆర్ భార్య పేరుతో కుటుంబసభ్యులపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తారు. కొడాలి నాని కూడా అంతే. ఎన్టీఆర్ పేరుతో ఇంత రచ్చ జరుగుతున్నా.. వ్యతిరేకిస్తున్నానని చెప్పలేని దౌర్భగ్య పరిస్థితిలో పడిపోయారు. ఆయనకు వ్యక్తిత్వం అంటూ లే్కుండా పోయింది. ఏమైనా ఉంటే జగన్ దాన్ని చంపేసినట్లే.
యార్లగడ్డ రాజీనామా – ఆ పాటి ధైర్యం లేదా ?
అయితే ప్రజల ఓట్ల రాజకీయాలతో సంబంధం లేదని అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. దేనికైనా వైఎస్సార్ పేరు పెడితే తనకు అభ్యంతరం లేదని… కానీ, ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని… అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తర్వాత వెనక్కి తీసుకుంటారేమో తెలిదు కానీ ఆయన మాత్రం కాస్త అడుగు ముందుకేశారు. వంశీ కూడా… జగన్ ను బతిమాలుతున్నట్లుగా ఓ ప్రకటన చేశారు. వర్శిటీ పేరు ఉంచాలన్నారు.
రాజకీయంగా ఎదిగి మూలాల్ని తెగ నరుక్కున్న తమ్మినేని !
బిల్లును పాస్ చేసిన సమయంలో స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం ఎన్టీఆర్ పిలుపుతో ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఎదిగారు. ఆయనే ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెడుతున్న బిల్లు ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు. దీనికి ఆయన సంతోషపడి ఉంటే.. ఈ రోజు ఈ స్థాయిలో ఆయన ఉన్నదానికి అర్థం కూడా ఉండదు. కానీ అదే రాజకీయం అని అనుకోవాలేమో?