వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్న జగన్కు ఈసీ షాక్ ఇచ్చింది. అలాంటి ఎన్నిక చెల్లదని స్ఫష్టం చేసింది. రాజకీయ పార్టీల్లో శాశ్వత పదవులు ఉండవని.. అది ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేశారు. అలాంటి ఎన్నిక ప్రజాస్వామ్య విరుద్ధమని.. ఇలాంటి ఎన్నిక ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని వైఎస్ఆర్సీపికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది.
నిజానికి ఇది రాజకీయాల్లో ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. శాశ్వత పదవులు ప్రజాస్వామ్యంలో ఉండవని.. ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నిక కావాల్సిందేనని అనేక మంది నిపుణులు చెప్పారు. అయితే జగన్ అంటే.. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అనుకునే బాపతు. ఎవరు చెప్పినా ఆయన ఊరుకోలేదు. ప్లీనరిలో శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకున్నారు. పార్టీ నేతలతో బాకా ఊదించుకున్నారు. ఇప్పుడు ఈసీతో షాక్ తిన్నారు.
ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలా శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఎలా నియమించుకున్నారంటే… అప్పట్లో సజ్జల తమిళనాడులో గతంలో కరుణానిధి శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారని వాదించారు. కానీ ఆయన ఎప్పటికప్పుడు ఎన్నికవుతూ వచ్చారు. ఇలా తమ వాదనకు ఏదో ఓ ఫేక్ చూపించడం వైసీపీకి కామన్. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. పార్టీ లాక్కునే వాళ్లున్నారని..అందుకే ఇలా చేశామని చెప్పుకొచ్చారు. మరి ఈసీ దెబ్బతో పార్టీ లాక్కునేవాళ్లను గుర్తించి ముందుగానే బయటకు పంపుతారేమో చూడాలి !