ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల జగన్ ఏ రాజకీయ లాభం ఆశించారనేది సస్పెన్స్‌గా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానులు ఇతర పార్టీలకు ఓటు బ్యాంక్‌గా ఉండే అవకాశం లేదు. కొత్తగా వైఎస్ఆర్ను ఆకాశానికెత్తడం వల్ల ఎలాంటి ఓటు బ్యాంక్ దగ్గరకు రాదు. రకానీ ఇప్పుడు హఠాత్తుగా మార్చడం వల్ల.. చాలా మంది సొంత పార్టీనేతల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు అనే అంశం గత మూడున్నరేళ్లలో ఎప్పుడూ చర్చకు రాలేదు. రాత్రికి రాత్రే ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును మార్చాలని ఆన్ లైన్లోనే అంగీకారం తీసుకున్నారు. ఇంత వేగంగా పని పూర్తి చేశారంటే హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమైనా అయి ఉండాలి లేదా.. పకడ్బందీ వ్యూహం ప్రకారం బయటకు పొక్కకుండా పని పూర్తి చేశారనైనా అనుకోవాలి. అయితే ఇలా చేసినా అసలు మోటో ఏమిటన్నది మాత్రం క్లారిటీ లేదు.
గత మూడున్నరేళ్లే వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యూహాలను చూస్తే.. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి రాజకీయ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాంటిదేదో డైవర్షన్ కోసమే చేసి ఉంటారని దాదాపుగా అన్ని పార్టీల నేతలూ చెబుతున్నారు. కానీ అదేమిటన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికరమైన అంశం వెలుగులోకి రాబోతోందా అనే చర్చ కూడా జరుగుతోంది.