కుప్పం సీటు బీసీలదని వారి సీటును చంద్రబాబు లాక్కున్నారని జగన్ కుప్పంలో ప్రకటించారు. అది బీసీల సీటు అని జగన్ తన పార్టీ తరపునవ అభ్యర్థిగా ప్రకటించిన భరత్ బీసీ కాబట్టి వారి సీటు అని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. కుప్పం సభలో బీసీలకు చంద్రబాబు ఏమీ చేయలేదని ఎప్పటిలాగే చాలా మాటలు చెప్పారు. అయితే అన్నీ విన్న తర్వాత .. జగన్ గురించి అందరికీ ఒకటే గుర్తుకు వస్తుంది.
అసలు వైఎస్ఆర్సీపీ ఎవరిది ? అని. వైఎస్ఆర్సీపీ శివకుమార్ అనే ఓ బీసీ నేతది. ఆయన వైఎస్ చనిపోయిన తరవాత వైఎస్ పై అభిమానంతో పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్తూంటే.. జగన్ ఆయనను పిలిచి .. పార్టీలో పెద్ద పీట వేస్తానని హామీ ఇచ్చి … పార్టీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బీసీ నేతను వెళ్లగొట్టినంత పని చేశారు. పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకపోగా.. ఆయనను అవమానించారు. చివరకి ఆయన తన పార్టీ తనకు కావాల్సిందేనని.., ఈసీ దగ్గర పోరాటం చేయడానికి రెడీ అయిపోతే రాత్రికి రాత్రి బుజ్జగించి ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చి నోరు మూయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శివకుమార్ ను భయపెట్టి అలాగే ఉంచేశారు.
వైఎస్ఆర్సీపీ శివకుమార్ పేరు మీద ఉండి ఉంటే.. .ఆయన అగ్రనేతగా మారి ఉండేవారేమో ? ఓ బీసీ నేత సంచలనం సృష్టించి ఉండేవారేమో? బీసీ నేత నుంచి ఏకంగా పార్టీనే లాక్కుని., కులమతాలకు అతీతంగా కుప్పంలో మూడు దశాబ్దాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్న చంద్రబాబు బీసీల సీటు లాక్కున్నారంటూ.. చెప్పడం జగన్‌కే చెల్లింది. బాబాయ్ ను చంపేసి గుండె పోటు అని చెప్పినంత ఈజీగా.. తాను బీసీ నుంచి పార్టీని లాక్కుని దానికి అధినేతగా చెలామణి అవుతూ.. ఇతర పార్టీల నేతలపై ఆరోపణలు చేయడం జగన్‌కే చెల్లిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.