ఏపీ సీఐడీ ఒక్క సారిగా ఇళ్ల మీద పడుతుంది. తలుపులుల బద్దలు కొడుతుంది. ఇంట్లో వాళ్లని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఓ రకమైన సీన్ క్రియేట్ చేస్తుంది. ఎడెనిమిది మంది వరకూ సివిల్ డ్రెస్లో వచ్చి ఎగబడారు. పట్టుకెళ్తారు. ఓ రోజంతా కస్టడీలో ఉంచుకుంటారు. కొడతారో.. తిడతారో ఏం చేస్తారో గుట్టుగా చేస్తారు. ఇరవై నాలుగు గంటలు పూర్తవుతున్న వేళ కోర్టులో ప్రవేశ పెడతారు. ఇదీ ఓ కేసేనా… ఇలాంటి కేసులకు అరెస్టులు చేస్తారా.. సీఆర్పీసీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని న్యాయమూర్తి ప్రశ్నిస్తారు.
సీఐడీ అధికారులు నోటీసులు ఇస్తే తీసుకోలేదని బొంకుతారు. కానీ.. ఇప్పుడే నోటీసులివ్వండి అంటే.. కుదరదంటారు. చివరికి వారికి బెయిల్ మంజూరవుతుంది. అయితే ఎపిసోడ్లో చాలా స్పష్టంగా ఏపీ సీఐడీ చట్టాన్ని ఉల్లంఘించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా 73 ఏళ్ల జర్నలిస్టు అంకబాబు విషయంలోనూ అదే జరిగింది. గన్నవరం కేంద్రంగా జరిగిన బంగారం స్మగ్లింగ్ వార్తను ఆయన వాట్సాప్లో ఫార్వార్డ్ చేశారని ఇంటిపై ఎనిమిది వంది వరకూ దాడి చేసి తీసుకెళ్లిపోయారు.
కోర్టులో ప్రవేశపెడితే న్యాయస్తానం బెయిల్ ఇచ్చింది. కానీ అతన్ని.. అతని కుటుంబాన్ని మానసి వేదన కు గురి చేసిన సీఐడీకి మాత్రం పోయిదేమీ లేదు. ఇలా ఒక్క అంకబాబు కాదు.. గత మూడున్నరేళ్లుగా ఏపీ సీఐడీ బాధితుల్లో ఎంతో ఉన్నారు. అచ్చెన్నాయుడు దగ్గర్నుంచి కొన్ని వందల మంది బాధితులు ఉన్నారు. కోర్టులు ఎన్ని చీవాట్లు పెట్టినా అదే పద్దతి. ఇలా ఎంత కాలం? ప్రైవేటు సైన్యంలా మారిన సీఐడీ నుంచి ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణ ఎప్పుడు లభిస్తుంది ?. ఇదంతా వ్యవస్థలో ఉన్న లోపమేనా ?