గత వారం ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టింది టాలీవుడ్. ఒకే రోజు మూడు సినిమాలు (ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శాకిని – డానికి, నేను మీకు బాగా కావాల్సినవాడిని) విడుదలైతే.. మూడూ ఫ్లాపులే. ఈ వారం కూడా అదే ఫీట్ రిపీట్ అయ్యింది. ఈ శుక్రవారం అల్లూరి, కృష్ణ వ్రింద విహారి, దొంగలున్నారు జాగ్రత్త ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడూ ఫ్లాప్ టాక్ తెచ్చుకొన్నాయి. మూడింటిలో.. కృష్ణ వ్రింద విహారినే కాస్త బెటర్. దానికే కాస్తో కూస్తో వసూళ్లు దక్కుతున్నాయి. అల్లూరి బీ, సీల్లో ఓమాదిరి వసూళ్లు తెచ్చుకొంది. కానీ… అది చాలవు. దొంగలున్నారు జాగ్రత్తని ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజానికి ఇది ఓటీటీలో విడుదల చేయాల్సిన సినిమా. ఓటీటీలు ఈమధ్య డైరెక్ట్ రిలీజ్లు చేయడం లేదు. కనీసం 10 – 20 థియేటర్లలో సినిమాని విడుదల చేస్తే, ఆ తరవాత.. ఓటీటీకి తీసుకొంటున్నారు. అందుకోసమే ఈసినిమాని థియేటర్లలో విడుదల చేయాల్సివచ్చిందని టాక్.
ఈ శుక్రవారం `అవతార్` రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్ లోనూ ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. హైదరాబాద్లో ఎన్ని షోలు వేస్తే.. అన్నీ ఫుల్స్ అవుతున్నాయి. బాలకృష్ణ `చెన్న కేశవరెడ్డి` రీ రిలీజ్లోనూ అదరగొట్టింది. వచ్చేవారం మణిరత్నం సినిమా విడుదల అవుతోంది. కార్తి, విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి స్టార్లున్నారు కాబట్టి… మణిరత్నం సినిమా కాబట్టి ఓ లుక్ వేయొచ్చు.కాకపోతే ఈ సినిమాకి ఏమాత్రం బజ్ లేదు.