గాడ్ ఫాదర్.. చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబరు 5న వస్తోంది. ఈనెల 28న అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ముంబైలోనూ ఈ సినిమాని ప్రమోట్ చేయాలన్నది చిరు ఆలోచన. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సల్మాన్ డేట్లు చూసుకొని ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించాలనుకొంటున్నారు. ఈనెల 30 లేదా 31న ముంబైలో ఈవెంట్ ఉండొచ్చు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లలో నయనతారని తీసుకురావాలని చిత్రబృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాధారణంగా నయన ప్రమోషన్లకు రాదు. ఈ విషయం ఎగ్రిమెంట్ చేసేటప్పుడే చెప్పేస్తుంది. `సైరా` ప్రమోషన్లలోనూ నయన కనిపించలేదు. అయితే… గాడ్ ఫాదర్ కోసం ఆమెని తీసుకురావాలని చూస్తున్నారు. ఈ విషయమై నయనతో… చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. కనీసం ఓ వీడియో ఇంటర్వ్యూ వదిలినా `గాడ్ ఫాదర్`కి ప్లస్ అవుతుంది. మరి నయన ఏమంటుందో..?