మాచర్ల నియోజక వర్గం సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత నితిన్ మరో సినిమా మొదలెట్టలేదు. అయితే `మాచర్ల..` విడుదలకు ముందే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకి క్లాప్ కొట్టారు. ఓ పాటని కూడా ఫారెన్ లో చిత్రీకరించారు. అయితే ఆసినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వాల్సింది. కానీ జరగలేదు. దీనికి చాలా చాలా కారణాలున్నాయి.
`మాచర్ల..` దెబ్బ కొట్టడంతో స్క్రిప్టు విషయంలో నితిన్ చాలా పట్టుతో ఉన్నాడట. ఎలాంటి డౌటూ లేకుండా చేతికి పక్కాగా స్క్రిప్టు వచ్చినప్పుడే… షూటింగ్ మొదలెడదామని చెప్పాడట. పైగా వక్కంతం సినిమాకి సంబంధించి సెకండాఫ్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. దాంతో.. వక్కంతం ఇప్పుడు స్క్రిప్టుని ఇంకాస్త టైట్ చేస్తూ రాస్తున్నాడని సమాచారం. నితిన్ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. దానికి పవర్ ఫుల్ నటుడు కావాలి. సరైన విలన్ని వెదికి పట్టుకోవడం పెద్ద సమస్యగా మారింది. విలన్ దొరికితే.. ఈ సినిమా సెట్టయిపోయినట్టే. అందుకే నితిన్ సినిమా లేటవుతోంది.