సీఎం జగన్ తిరుమల బయలుదేరారు. ఆయన తన భార్యతో కలిసి విజయవాడ ఎయిర్పోర్టుకు వచ్చారు. దీంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు తిరుమలలో సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించబోతున్నారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను జగన్ తలకిందులు చేశారు. ఎందుకంటే తిరుపతిలో ఒక్కరే దిగారు. అదేమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు పైగా ఫ్లైట్ గంటన్నర ఆలస్యం అయింది. దీంతో ఆరా తీస్తే విషయం ఏమిటో బయటపడింది. అసలేం జరిగిందంటే… జగన్ తన సతీమణితో ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరారు.
కానీ వయా బేగంపేట. ఆయన మొదట బేగంపేట వెళ్లారు. అక్కడ తన సతీమణిని డ్రాప్ చేశారు. అక్కడ్నుంచి తిరుపతికి వెళ్లారు.అంటే విజయవాడ నుంచి తిరుపతి వయా బేగంపేట అన్నమాట. అది ప్రజాధనంతో అద్దెకు తీసుకున్న విమానం. కానీ దాన్ని ఆయన సొంత వాహనంలా ఇష్టారీతిన వాడుకుంటున్నారు. గతంలో వ్యక్తిగత పర్యటనలకూ పెద్ద ఎత్తున లగ్జరీ విమానాలు తీసుకుని ప్రయాణించారు. లోకల్ లో కూడా అదే పరిస్థితి. నిజానికి సీఎం సతీమణి వెళ్లదల్చుకుంటే.. గన్నవరం నుంచి చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. కానీ ప్రత్యేక విమానంలో వెళ్లాలనుకున్నారు.. వెళ్లారు.
అయితే అది ప్రజాధనమా మరొకటా అనేది పట్టింపులేదు. గతంలో ప్రభుత్వ కాన్వాయ్ లోకి కార్లను కూడా కుటుంబ కార్యక్రమాలకు వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రే స్వయంగా కుటుంబ కార్యక్రమాల కోసం విమానాలను అసువుగా వాడేస్తున్నారు. దీనికి ఎవరికీ సమాధానం చెప్పరు.. ఎందుకంటే ఇలాంటి వాటిని అసలు జగన్ పట్టించుకోరు మరి !