ప్రగతి భవన్లో పెత్తనం అంతా ఎంపీ సంతోష్దేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీఎం కేసీఆర్‌కు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకుంటారు. కేసీఆర్ ఎవరితో టచ్‌లో ఉండాలనుకుంటున్నారు…ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు .. ఎవర్ని ప్రగతి భవన్‌కు ఆహ్వానించాలి లాంటివన్నీ ఎగ్జిక్యూట్ చేసేది కేసీఆరే. ఇంకా చెప్పాలంటే కేసీఆర్‌కు సరైన సమయానికి మందులు ఇచ్చేది కూడా సంతోషేనని చెబుతూ ఉంటారు. ఓ రకంగా కేసీఆర్ తలలో నాలుక లాంటి సంతోష్ రావు ఇప్పుడు ప్రగతి భవన్‌కు రావడం లేదు. నాలుగు రోజులుగా ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని చెబుతున్నారు.
ఇటీవల వెన్నమనేని శ్రీనివాసరావు అనే వ్యాపారిపై ఈడీ దాడులు చేసింది. ఆయన ఎంపీ సంతోష్ రావుకు అత్యంత సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి అన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో ఆయన దగ్గర చేసిన లావాదేవీలకు … ఎంపీ సంతోష్ కూడా ఈడీ చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపైనే సంతోష్ ఆందోళనకు గురయ్యారని అంటున్నారు. ఈడీ గుప్పిట్లో సంతోష్ చిక్కుకునే అవకాశం ఉందని తెలియడంతో కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా మరింత నొచ్చుకున్న సంతోష్ రావు..నాలుగు రోజులుగా ప్రగతి భవన్ వైపు రావడం లేదని చెబుతున్నారు.
సంతోష్‌తో సన్నిహితంగా ఉండే కొంత మంది నేతలు ఆయనతో టచ్‌లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఫోన్ కు అందుబాటులో లేరు. అసలు హైదరాబాద్‌లో కూడా ఉన్నారో లేరోనని కొంత మంది చెబుతున్నారు. అయితే ఇటీవల పరిణామాలతో సంతోష్ కొంత అసంతృప్తి చెందిన మాట నిజమే కానీ.. ఆయన ఎక్కడికి వెళ్లలేదని.. మళ్లీ ఒఒకటి రెండు రోజుల్లో ప్రగతి భవన్లో తన రోజువారీ విధులకు హాజరవుతారని అంటున్నారు. మొత్తానికి .. ఈడీ దాడుల అంశం కేసీఆర్ ఫ్యామిలీని ఎక్కువగానే చికాకు పెడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.