దివంగత నటుడు కృష్ణంరాజు పేరుమీద ఓ స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం రెండు ఎకరాలు కేటాయించనున్నట్టు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణంరాజు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఏపీ మంత్రులు, ఎం.ఎల్.ఏలు కూడా పాల్గొన్నారు. ఈ రెండెకరాలు మొగల్తూరులోకే కేటాయించే అవకాశం ఉంది. ఈ స్మృతివనంలో కృష్ఱంరాజు విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న ప్రతిపాదన ఉంది. దాంతో పాటు కృష్ణంరాజు గుర్తుగా ఆయన వాడిన కాస్ట్యూమ్స్, సినిమా లైబ్రరీ, ఓ ఆడిటోరియం.. ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. ఇదంతా మాటలకే పరిమితం చేస్తారా, లేదంటే కార్యరూపం దాల్చేలా చూస్తారా? అనేది చూడాలి. మంత్రి చెప్పినట్టు స్మృతివనం ఏర్పాటు చేస్తే.. కృష్ణంరాజుకి గొప్ప నివాళి అందించినట్టే..!