ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్ర తెరపైకి వస్తోంది. రేణు దేశాయ్ హేమలతా లవణం పాత్రని పోషిస్తున్నారు. రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 1970 స్టువర్ట్పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్ గా రూపొందుతోంది.
ఈ చిత్రంలో హేమలతా లవణం పాత్రని కీలంగా రాసుకున్నాడు దర్శకుడు వంశీ. ఈ పాత్రని రేణు దేశాయ్ తో చేయించారు. తాజాగా ఒక వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ రావడం కనిపించింది. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీత దర్శకుడు.