కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు పార్టీ ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అయితే అందరిలా అద్దె విమానాల్లో కాదు.. సొంత విమానంలో రూ. ఎనభై కోట్లు పెట్టి సొంత చార్టెడ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేయాలని కేసీఆర్ నిర్ణయంచారు. టీఆర్ఎస్కు దాదాపుగా రూ. 850కోట్లకుపైగా నగదు నిల్వలున్నాయి. ఇతర ఆస్తులతో పోలిస్తే అవి వెయ్యి కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. అలాగని సీఎంకేసీఆర్ ప్రతీ దానికి పార్టీ ఖర్చులకు వాటిని వాడటంలేదు.
ఎప్పడు ఏ కార్యక్రమం నిర్వహించినా పార్టీ నేతలు విరాళాలు ఇస్తూంటారు. అవి ఇంకా మిగులుతూంటాయి.ఇప్పుడు కేసీఆర్ సొంత ఫ్లైట్ వ్యవహారంలోనూఅంతే. మొత్తంపార్టీ నేతలు విరాళాలుగా ఇస్తారు. కేసీఆర్ కొనేస్తారు. దేశంలోనే సొంత విమానం ఉన్న పార్టీగా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ నిలిచే చాన్స్ ఉంది. ఆ విమానం ద్వారా ఆయన దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయనున్నారు లాంఛనంగా పార్టీ ప్రకటన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఓ బహిరంగసభ నిర్వహిస్తారు. ఆ తర్వాత దేశం మొత్తం తిరుగుతారు. విస్తృతంగా సభలు.. సమావేశాలు నిర్వహిస్తారు.
అంటే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ.. ఓ రేంజ్లో ఉండబోతోందన్నమాట. ఉత్తరాది నేతలకు ఎలా పరిచయం అవ్వాలో అలా పరిచయం చేసుకునేందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇవన్నీ ఎంత మేర సత్ఫలితాలు ఇస్తాయో తెలియదు కానీ… చర్చల్లో మాత్రం ఉండటం ఖాయం.