సినీ నటుడు ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాకిచ్చింది. ఆయన తన భార్యకు నెలకు రూ.ఎనిమిది లక్షల భరణం చెల్లించాల్సిందేనని విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. సినిమాల్లో అవకాశాల కోసం ఆయన భార్య కుటుంబం నుంచి ఆర్థిక సాయం పొందారు. సినిమాల్లో స్థిరపడిన తర్వాత భార్యను వదిలేశారు. దాంతో ఆమె విజయవాడ కోర్టులో కేసు వేసింది. విచారణ జరిపిన కోర్టు.. నెలకు రూ. ఎనిమది లక్షల భరణాన్ని ప్రతీ నెలా పదో తేదీ లోపు ఇవ్వాలని ఆదేశించింది.
ఫృధ్వీక ఇది దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే సినిమాల్లో మంచి ఊపు మీద ఉన్న సమయంలో ఆయన రాజకీయంలో వేలు పెట్టారు. ఆ రాజకీయం కూడా డీసెంట్‌గా చేయలేదు. సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ దూషించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. చివరికి ఎవరిని మెప్పించేందుకు అలా చేశారో వాళ్లే ఆయనకు వైసీపీలో చేటు లేకుండా చేశారు. ఇప్పుడాయనకు అటు సినిమాల్లేవు.. ఇటు రాజకీయాల్లేవు. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు నెలకు రూ. ఎనిమిది లక్షలు భార్యకు కట్టమన ఆదేశించడంతో మరిన్ని చిక్కుల్లో పడిపోయారు. కట్టకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది . అవకాశాలు పడిపోయిన ఫృధ్వీకి అంత పెద్ద మొత్తంలో భరణం చెల్లించడం కష్టమే. ఓ తప్పు జీవితాన్ని తలకిందులు చేస్తుందనే విషయం ఫృధ్వీ విషయంలో తేలిపోయింది. రాజకీయాల్లో వేలు పెట్టి వైసీపీ .. ట్రాప్‌లో చిక్కుకోకపోతే.. కనీసం ఆయన సినిమాల్లో అయినా బిజీగా ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా నష్టపోయారు.