ఏపీ సీఐడీ ఉన్నది ప్రభుత్వాన్ని విమర్శించే వారందరిపై ఎటాక్ చేయడానికేనన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎన్ని విమర్శలు వచ్చినా..కోర్టులు చీవాట్లు పెట్టినా తగ్గడంలేదు. ఈ సారి ఇస్కాన్‌కు చెందిన స్వామిజీ రాధామనోహర్ దాస్‌పైనా సీఐడీ గురి పెట్టింది. రాధామనోహర్ దాస్.. తిరుమలో జరుగుతున్న అక్రమాలపై చాలా సార్లు మాట్లాడారు. టీటీడీ బోర్డు భక్తులను ఎలా దోచుకుంటుందో వివరించారు. ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాధామనోహర్ దాస్ ఆరోపణలను టీటీడీ ఖండించింది. అయితే అనూహ్యంగా సీఐడీ ఆయనను ప్రశ్నించింది.కేసు పెట్టారో లేదో స్పష్టత లేదు.. బెదిరించాలనుకున్నారేమో కానీ విశాఖలో ఉన్న రాధామనోహర్ దాస్‌ను అరెస్ట్ చేసినట్లుగా హడావుడి చేశారు. కానీ నాలుగైదు గంటల పాటు ప్రశ్నించి వెళ్లారు. మరోసారి తిరుమల విషయంలో టీటీడీ బోర్డుపై విమర్శలు చేస్తే అంతకు మించి ఉంటాయన్న సంకేతాలు ఇచ్చి వెళ్లినట్లుగా కనిపిస్తోంది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన..అన్యాయాలను ఎదిరించిన ప్రతి ఒక్కరిపైకి సీఐడీ దూసుకెళ్లడం కామన్‌గా కనిపిస్తోంది. వర్గాల మధ్య ద్వేషాలు రెచ్చగొడుతున్నారనే కామన్ ఓ కేసు పెట్టేస్తున్నారు. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. చివరికి రాధామనోహర్ దాస్‌ను కూడా వదల్లేదు. అయితే సీఐడీ ఇలా చేయడం కన్నా వారు చేస్తున్న విమర్శలపై దృష్టి పెట్టడం మంచిదని..అలా చేస్తే ప్రజలు హర్షిస్తారని..అంటున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సరే అనుకోవచ్చు కానీ జరుగుతున్న వాటిని చెబితే.. ఎదుకు కక్ష సాధిస్తున్నారని మండి పడుతున్నారు.