విశాఖలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు చేస్తున్న భూ దందాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. దసపల్లా భూములపై పై స్తాయి నుంచే కన్నుపడటంతో వాటిని మెల్లగా ప్రైవేటు పేరుతో వాటిని దాదాపుగా కొట్టేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. విశాఖలో దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2014లో వాటిని ప్రభుత్వ భూముల జాబితా 22-ఎలో చేర్చారు. ఆ తరువాత ఆ తీర్పుపై అప్పీల్ చేశారు. ఈ వివాదం కోర్టులో ఉండగానే వైసీపీ నేతలు కమలాదేవి వారసులతో డెలవప్మెంట్ ఒప్పందం చేసుకున్నారు.
ఆ భూములు 22-ఏలో వున్నందున వాటిపై డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయడం కుదరదు. ఈ భూముల విషయంలో ముఖ్య నేతలే రంగంలోకి దిగడంతో అడ్డం లేకుండా పోయింది. టీడీపీ హయాంలో దసపల్లా భూములపై ఈగ వాలలేదు.కానీ దసపల్లా భూములను తెలుగుదేశం పార్టీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలు నానా యాగీ చేసేవారు. తాము అధికారంలోకి వస్తే దసపల్లా భూములు కాపాడతామని ప్రచారం చేశారు. ఇప్పుడు అదే పెద్దలు ఆ భూములను అస్మదీయులకు కట్టబెట్టేశారు. నిర్మాణాలు కూడా ప్రారంభించారు.