ఇండ్ భారత్ కంపెనీల ద్వారా బ్యాంకులకు పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఎగ్గొట్టిన వ్యవహారంలో తన కంపెనీలపై జరుగుతున్న విచారణపై రఘురామ ఊరట పొందారు. సుప్రీంకోర్టు సీబీఐ కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇందు భారత్ ధర్మల్ కంపెనీ పై దాఖలైన సీబీఐ కేసు విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. తన కంపెనీ దివాళా తీసిందంటూ ప్రకటించడాన్ని గతంలో ఎంపీ రఘురామ హైకోర్టు (High Court)లో సవాలు చేశారు.
దివాళా కంపెనీగా ప్రకటించడానికి అనుసరించాల్సిన పద్ధతులను అనుసరించలేదన్నారు. మొదట హైకోర్టులోనూ ఎంపీ రఘురామకు ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కేసుపై మొదట స్టే వచ్చింది. తర్వాత తొలగించారు. హైకోర్టు నిర్ణయాన్ని ఎంపీ రఘురామ సుప్రీంలో సవాలు చేశారు. తుది తీర్పు వెలువడేంతవరకూ కేసు విచారణను నిలిపివేయాలని సీబీఐఐకి ఆదేశాలను జారీ చేసింది. దీంతో రఘురామకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.
ఇండ్ భారత్ పవర్ పేరుతో రుణాలు తీసుకుని దారి మళ్లించారని రఘురామపై ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందే ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత ఆ కేసు అలా సాగుతూ వస్తోంది. అయితే రఘురామ మాత్రం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయని.. బ్యాంకులతో సెటిల్ చేసుకుంటామని చెబుతున్నారు. కానీ ఈ కేసులో మాత్రం దివాలా ప్రక్రియ నడుస్తోంది.