ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న హరీష్ రావుకు.. కేసీఆర్‌తో గొడవలు ఉన్నాయని సజ్జల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. అసలు జగన్ కుటుంబం ఇలా చీలికలు పేలికలు అయిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డే కారణం అని టీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్ సజ్జలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. జగన్ కుటుంబంలో సజ్జల ఉడుములా చొరబడ్డారని మండిపడ్డారు. తల్లీని, కడుకుని.. చెల్లని విడదీశారని విమర్శించారు. ఆయన కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై వైసీపీలో చాలా అనుమానాలున్నాయి. అయితే ఇంత వరకూ ఎవరూ జగన్ కుటుంబంలో చిచ్చుకు సజ్జల కారణం అని చెప్పలేదు. తొలిసారి టీఆర్ఎస్ నేతల నుంచి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా సజ్జల ప్రస్తానం చూస్తే ఇదేమీ అబద్దం కాదని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక.. సీనియర్ జర్నలిస్ట్ పేరుతో జగన్ పంచన చేరిన ఆయన ఈనాడుకుపోటీగా పత్రిక పెట్టాలని ఒప్పించారు. పెట్టుబడుల వ్యూహం పన్నారు. ఆ పత్రికకు తానే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యూహం మార్చారు. సొంత పార్టీ పెట్టుకుంటే మంచిదని… వైఎస్ చనిపోయినప్పటి నుండే చావుల లెక్కలు సాక్షిలో రాయించి.. పెట్టి ఓదార్పు ప్రారంభించారు.
అనుకున్నట్లుగానే జగన్ పక్కన చేరి నెంబర్ టూ అయ్యారు. ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో ఆయనదే హవా. జగన్ మాట వింటారో లేదో కానీ అధికారవర్గాలు .. పార్టీ కూడా ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో జగన్ కు కుటుంబం అంతా దూరమైపోయింది. హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప ఎవరూ దగ్గరగా లేరు. వ్యూహాత్మకంగా సజ్జలే అందర్నీ దూరం చేశారన్న అనుమానాల్ని మొదటి సారి టీఆర్ఎస్ మంత్రి వ్యక్తం చేశారు. అయితే తమపై విమర్శలు చేయకుండా ఎలాగోలా.. హరీష్ ను కంట్రోల్ చేయాలని ప్లాన్ చేస్తే ఇలా తమపైనే రివర్స్ దాడి చేస్తున్నారేమిటని సజ్జల ఫీలయ్యే అవకాశం కనిపిస్తోంది.