ఈ బక్కపల్చని వ్యక్తి ఏం చేస్తాడని తనను అందరూ హేళన చేసినప్పుడల్లా మహాత్మాగాంధీనే గుర్తు చేసుకునేవాడినని కేసీఆర్ చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ తన బక్కపల్చని శరీరంతో ఏం చేసేవాడని ప్రశ్నించేవారన్నారు. అయితే మహాత్ముడు కూడా బక్కపల్చని వ్యక్తే నని కానీ స్వాతంత్ర్యం సాధించారని.,. తాను తెలంగాణ సాధించారననేది కేసీఆర్ ఉద్దేశం.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ తనను శారీరకంగానే కాకుండా రాజకీయ బలంగా కూడా బక్క పల్చని వ్యక్తిగానే చూస్తున్నారని కానీ గాంధీ స్వాతంత్య్రాన్ని సాధించినట్లుగా తాను దేశంలో రాజకీయంగా విజయం సాధిస్తానని కేసీఆర్ తన మాటల ద్వారా పరోక్షంగా చెప్పారని అర్థం చేసుకోవచ్చు. గాంధీ జయంతి కార్యక్రమాల్లో గతంలో కేసీఆర్ అంత చురుగ్గా పాల్గొన్న సందర్భాలు లేవు .కానీ ఇటీవల బీజేపీతో ఆయన ఢీ అంట ఢీ అంటున్నారు. బీజేపీ విధానాల ప్రకారం గాంధీని కాస్త దూరంగా నే ఉంచుతూంటారు . బయటకు గొప్పగా మాట్లాడుతూంటారు కానీ గాంధీ వల్లనే దేశ విభజన జరిగిందని ఆ పార్టీకి చెందిన వారు చెబుతూ ఉంటారు.
ఇలాంటి వాటికి కౌంటర్ ఇవ్వడానికి కేసీఆర్ మహాత్ముడికి ఇటీవలే ప్రాధాన్యం పెంచారు. అమృతోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమాను విస్తృతంగా ప్రదర్శించారు. పిల్లలకు చూపించారు. ఇప్పుడు తాను గాంధీ బాటలో పయనిస్తున్నానని తానకు ఆయనకు సారూప్యత ఉందని చెబుతున్నారు. కొసమెరుపేమిటంటే.. టీఆర్ఎస్ శ్రేణులు ఆయనను తెలంగాణ జాతిపిత, తెలంగాణ మహాత్ముడు అని చాలా కాలం నుంచే పిలుచుకుటున్నాయి.