‘నేనే రాజు – నేనే మంత్రి’… రానా సోలో హీరోగా చేసి, హిట్ కొట్టిన ఏకైక సినిమా. తేజకు ఇది కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. దగ్గుబాటి అభిరామ్ తో `అహింస` అనే చిత్రాన్ని తెరకెక్కించాడు తేజ. త్వరలోనే విడుదల కాబోతోంది. ఈసినిమా ఫలితంతో సంబంధం లేకుండా.. రానా ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. సురేష్‌బాబు నిర్మాత. కొద్ది రోజుల క్రితమే సురేష్ బాబు ఫైనల్ నేరేషన్ విని, ఓకే చెప్పాడని టాక్.
ఇది వరకు రానా కోసం ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే టైటిల్ తో ఓ సినిమా తీద్దామనుకొన్నాడు తేజ. అది కూడా సురేస్ ప్రొడక్షన్స్ లోనే. కానీ… ఎందుకో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ కథని పక్కన పెట్టి, వేరే కథతో – ఈ కాంబోని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారని సమాచారం.