సానియా మీర్జాకు కొంచెం దుఃఖం , కొంచెం ఆంనదం కలిగే పరిస్థితి ఎందుకు వచ్చిందబ్బా అని ఆశ్చర్యం కలుగుతోంది కదా. సానియా జంట డబుల్స్ జైత్రయాత్రలో ఆ మధ్యన పరాభవం ఎదురై కూడా చాలారోజులు గడచిపోయాయి కదా.. ఇప్పుడు దుఃఖం ఎందుకు కలిగినట్టా అనుకుంటున్నారు కదా..? ఈ దుఃఖం ఆమె ఓడిపోవడం వల్లనో, లేదా మరో కారణం వల్లనో కలిగింది కాదు..! ఆమె భర్త షోయబ్ మాలిక్‌తో ముడిపడినట్టింది.
శనివారం నాడు భారత- పాకిస్తాన్ల మధ్య ఢాకా మిర్పూర్లో టీ20 మ్యాచ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిదే. ఈ మ్యాచ్‌కు ముందు సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ మీడియాతో తన ముచ్చట్లు పంచుకుంటూ.. సానియా మాత్రం భారత్ విజయం సాధించాలని, భర్తగా తాను మంచి పెర్ఫార్మెన్స్ చూపించాలని కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. భారతదేశపు ఆడపడుచుగా తన సొంత దేశ విజయాన్ని కాంక్షించడమూ, పాకిస్తాన్ కోడలు అయినప్పటికీ.. భర్త బాగా ఆడాలని కోరుకోవడమూ ఆ రకంగా సబబే అన్నట్లుగా షోయబ్ చెప్పారు. బాగానే ఉంది.
కానీ శనివారం నాటి మ్యాచ్‌లో ఇలాంటి డబుల్ బొనాంజా సానియాకు దక్కలేదు. భారత్ విజయం సాధించింది. షోయబ్ మాటలు నిజమే అనుకుంటే గనుక.. ఆ విజయం సానియాకు ఆనందం కలిగించే ఉంటుంది. కానీ ఆమె దుఃఖ కారణం మాత్రం భర్తే. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌గా షోయబ్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. తను కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే పాపం.. శనివారం మ్యాచ్ సానియాకు కొంచెం మోదం.. కొంచెం ఖేదం కలిగించిందని అనుకోవాలి!