తన వ్యూహాలతోనే అందరూ గెలిచేస్తున్నారని ముఖ్యమంత్రులపోతున్నారని.. తాను మాత్రం ఎందుకు కాకూడదని అనుకున్నారేమో కానీ సొంత రాష్ట్రం బీహార్‌లో రాజకీయం ప్రారంభించేశారు. ముందుగా సొంత పార్టీ పెట్టకుండా పాదయాత్ర చేయాలనుకున్నారు. గాంధీ జయంతి రోజున .. ప్రారంభించారు. ఆయన తన ఐ ప్యాక్ సంస్థ ద్వారా చారా ప్రయత్నాలు చేసి..పబ్లిసిటీ చేసి.. సోషల్ మీడియాలో చాలా పిలుపులు ఇచ్చినప్పటకీ పట్టుమని వంద మంది కూడా రాలేదు. ఆయన వ్యూహాత్కకంగా గాంధీ జయంతి రోజున బీహార్‌లోని చంపారన్‌లో ఉన్న గాంధీ స్మారక కేంద్రం నుంచి యాత్రను ప్రారంభించారు.
ఆ రోజున అక్కడికి పెద్ద ఎత్తున జనం వస్తారని.. వారందర్నీ తన ఖాతాలో వేసుకోవచ్చని ఆయన ఫీలయ్యారు. కానీ అక్కడికి కూడా జనం పెద్దగా రాలేదు. పీకే ఏర్పాటు చేసిన బహిరంగసభ మత్తం ఖాళీగా కనిపించింది. అయినా సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేసుకోవడం దిట్ట కాబట్టి దాన్నే నమ్ముకుని నడక ప్రారంభించారు. మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తానని ఆయన చెబుతున్నారు. ఆయన ఇలా ఓ పది మంది తన ఐ ప్యాక్ సిబ్బందితో పాదయాత్ర చేయాలి తప్ప.. ఆయన వెంట వచ్చే వారు ఎవరూ లేరని తొొలి బహిరంగసభతోనే తేలిపోయింది.
పీకే రాజకీయాల్ని చూసి చాలా మంది చపాతీ ఎలా చేయాలో చెప్పడం వేరు.. చపాతీ ఎలా చేయాలో ప్రత్యక్షంగా తయారు చేయడం వేరు అని సలహాలిస్తున్నారు. అంతో ఇంతో చదువుకున్న వారిని వాట్సాప్ యూనివర్శిటీ.. కుల, మత చిచ్చు పెట్టి రాజకీయం చేయగలరు కానీ అసలు చదువుకోని వాళ్లను పీకే ఏమి చేయలేడని ఆయనపై సెటైర్లుపడుతున్నాయి.