ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య రామాలయం ప్రారంభించి ఆ ఊపులో ఈ సినిమాను కూడా విడుదల చేస్తారని … రాముడ్నిఅలా రాజకీయాలకు వాడుకుంటారని చెప్పారు. ఇది నిజమేనని ఎక్కువ మంది అనుకున్నారు. తీరా ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ చూసిన తరవాత బీజేపీ నేతలే ఉలిక్కి పడుతున్నారు. ఇది రాముడి సినిమానా అని బిత్తరపోతున్నారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి ఏకంగా ఆదిపురుష్ డైరక్టర్కే వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది బయటకు చెప్పకపోయినప్పటికీ ఎక్కువ మంది అభిప్రాయం అదే. రాముడి కథ అని చెప్పడమే కానీ అందులో రాముడి కథకు సంబంధించిన పాత్రలేవీ కనిపించడం లేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. పైగా అది పూర్తిగా ప్రభాస పేరును ఉపయోగించుకుంటూ.. తీస్తునన యానిమేషన్ సినిమా.ఈ సినిమా ట్రైలర్ చూశాక వస్తున్న ట్రోల్స్‌కు లెక్క లేకుండా పోయింది. రాజకీయంగా ఇది బీజేపీకి సంబంధం లేదని తేలిపోతోంది.
నిజానికి సినిమాలతో సంబంధం లేనట్లుగా సీరయస్ గా స్టార్లతో… తమ భావజాలం ఉన్న సినిమాలు తీయించుకోవడంలో బీజేపీ పెద్దలు సిద్ధహస్తులు.ఈ విషయం చాలా సినిమాల వియంలో రుజువు అయింది. చాలా మంది దర్శకులు వారు అనుకున్న ఔట్ పుట్ ఇచ్చారు కూడా. అజయ్ దేవగణ్‌తో తీసిన ఓ సినిమా చూసిన తర్వాత ఓం రౌత్‌కు కూడా అలాంటి టాస్క్ ఇచ్చారేమో కానీ ఆయన మాత్రం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇప్పుడీ సినిమాకు తమకూ సంబంధం లేదని బీజేపీనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.