కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్పై మీ స్పందనేంటి అంటే.. చంద్రబాబు ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అడగకపోయినా స్పందిస్తున్నారు. జగన్ తరపున ప్రతీ సారి మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి.. బీఆర్ఎస్తో తమకు సంబంధం లేదని జాతీయ రాజకీయాల్లో అసలు తమ పాత్ర లేదని.. తమకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. భవిష్యత్ రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలపై తమపై కామెంట్లు చేస్తున్నారేమో కానీ తాము మాత్రం ఆవేశపడబోమని.. తము పట్టించుకోమనిచెప్పుకొచ్చారు.
అయితే బీఆర్ఎస్పై ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ కేసీఆర్ విరుచుకుపడుతారేమోన కంగారు పడుతున్నారేమో ాకనీ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామన..
కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి మా పనితీరును మరింత మెరుగు పరుచుకోవచ్చని సూక్తులు చెబుతున్నారు.కానీ ఏపీలో అడుగు పెట్టే ముందు.., తెలంగాణతో సంబంధమున్న అంశాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చే్యడం లేదు. కానీ మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామన్న కలరింగ్ మాత్రం తగ్గడం లేదు.
కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషకుల స్థానంలో లేమని.. మా రాష్ట్రం అభ్యున్నతి మాకు ముఖ్యమని.. ఏపీ మాత్రమే తమ వేదిక అని.. ఇక్కడ ప్రజల ఆశీర్వాదాలే కోరుతున్నామంటున్నారు.
పక్క రాష్ట్రాల గురించి మేము మాట్లాడటం లేదని… వాళ్ళు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి విమర్శలు ఎందుకని అంచున్నారు. భవిష్యత్తు రాజకీయాల గురించి వాళ్ళు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు… మేము ఇక్కడి వ్యవహారాలపై మాత్రమే కట్టుబడి ఉన్నామని సజ్జల చెబుతున్నారు. తమతో కలిసి నడవాలని కేసీఆర్ ఆహ్వానించినా.. వెళ్లలేక.. కేసీఆర్ ఆగ్రహాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక కంగారు పడుతున్నట్లుగా ఉన్నాయి సజ్జల మాటలు.