ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు ప్రారంభమయింది. బడ్జెట్లో ప్రతిపాదించారు.. ఆయా శాఖలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బిఆర్ఒ) కూడా ఇచ్చేశారు.. ఇక అభివృద్ధి చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసేశారు.. అయితే నాలుగు నెలలైనా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కానీ ఈ సొమ్ము మాత్రం ఖర్చయిపోయింది.
బడ్జెట్లో చూపించిన లెక్కల్లో నాలుగు నెలల్లో ఖర్చు చేయాల్సిన రూ.41,170 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ నిబధనల ప్రకారం… కేటాయించిన కేటాయించిన నిధులను ఆయా శాఖలకు జమ చేయాలి. కానీజమ చేస్తున్నట్లుగా ఆదేశాలిస్తున్నారు కానీ జమ కావడం లేదు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ నిధులు విడుదల చేయడం లేదని, కొన్ని శాఖలకు విడుదల చేసినా వాటిని వెనక్కు తీసుకుంటున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికశాఖ దగ్గర్నుంచి వ్యవసాయ శాఖ వరకూ ఇలా అన్నిశాఖల్లో వేల కోట్లలోనే ఈ గోల్ మాల్ జరిగింది. గత ఏడాది కూడా అలాగేజరిగింది. అయితే బుక్ అడ్జస్ట్ మెంట్స్ అని బుగ్గన సమర్థించుకున్నారు. కానీ ఆ లెక్కవేలో తేలలేదు. ఇప్పుడు కూడా అదే చెప్పే అవకాశం ఉంది. అయితే ఆ డబ్బులన్నీ ఎవరో తినేసి ఉండరని.. జీతాలు… పథకాలకు మళ్లించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ పూర్తిసమాచారం బయటకు రాదు. ఎంత గోల్ మాల్ చేశారో.. తెలియాలంటే.. ప్రభుత్వం మారాల్సిందే. లేకపోతే కేంద్రం సంకల్పించాలి. కేంద్రం అలాంటి పనులు చేసే ఉద్దేశంలో లేదు.